స్టిక్కర్లు అంటించడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: మద్దిపాటి

రాష్ట్ర మంతా స్టిక్కర్లు అంటించడం తప్పా.. జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని గోపాలపురం టీడీపీ ఇన్చార్జ్ మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించిన ఇదేం ఖర్మం మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి పాల‌్గొన్న మద్దిపాటి వెంకటరాజు... వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న జగన్‌కు ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని హెచ్చరించారు. జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. విపక్షాల గొంతు నొక్కడమే పనిగా జగన్ ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అంతకు ముందు మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యకర్తల బైక్ ర్యాలీతో ద్వారకా తిరుమల పసుపుమయంగా మారిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com