Viveka Murder Case : సునీత పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ.. అవినాష్ రెడ్డికి షాక్

X
By - Vijayanand |21 April 2023 5:24 PM IST
వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టింది. ఆ తీర్పు ఆమోదయోగ్యం కాదన్న సుప్రీం.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులోని 18వ పేరాలో ఉన్న ఆదేశాలపై స్టే ఇచ్చింది. సోమవారం ఉదయం తొమ్మిదన్నరకు మరోసారి విచారణ చేపడతామని.. ఆ రోజే అన్ని విషయాలు పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దన్న సుప్రీం కోర్టు.. అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com