టీడీపీ శంకుస్థాపన చేసిన డేటా సెంటర్‌కు సీఎం జగన్ మళ్లీ..

టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన డేటా సెంటర్‌కు ఇవాళ జగన్ మళ్లీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపధ్యంలో అదానీ గ్రూప్‌పై జగన్ సర్కార్ వరాలు జల్లులు ప్రకటించేసింది. విశాఖలో వేల కోట్ల విలువైన భూములను అదానీకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. దాదాపు 5వేల500 కోట్ల కొండను రాసిచ్చింది జగన్ సర్కార్. అసలు ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు కాకముందే ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ హోదా ఇచ్చేసింది జీవీఎంసీ.అదానీ కోసం ప్రభుత్వ పెద్దల ఆదేశాలు జారీ చేయడంతోఆగమేఘాలపై అంగీకారం తెలిపింది జీవీఎంసీ. దీంతో భారీగా ఆదాయం కోల్పోనుంది జీవీఎంసీ కార్పొరేషన్.
అసలు విశాఖపట్నంలో ఇప్పటివరకు ఏపీఐఐసీ చాలా పారిశ్రామిక పార్కులు ఏర్పాటుచేసింది. ఆటోనగర్, రుషికొండ ఐటీ పార్కు, కంచరపాలెం ఇండస్ర్టియల్ ఎస్టేట్ ఇలా చాలా ఉన్నాయి. వీటన్నింటికీ అక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేసి, కొన్నేళ్లు గడిచిన తరువాత మాత్రమే ఐలా హోదా ఇచ్చారు. పరిశ్రమలు ఏర్పాటు కాకముందే ఏ పార్కుకీ ఇలా ఇవ్వలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com