Alluri District : అల్లూరి జిల్లాలో 10కి.మీ. ట్రాఫిక్ జామ్.. కారణమిదే..?

Alluri District : అల్లూరి జిల్లాలో 10కి.మీ. ట్రాఫిక్ జామ్.. కారణమిదే..?
X

ఏపీలోని అల్లూరి జిల్లాలో భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ ఘాట్ రోడ్డులో ఆగిపోయింది. ముందుకు కదలకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో 10 కిలో మిటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్‌ను క్రేస్ సాయంతో రోడ్డు పక్కకు పెట్టేందుకు చర్యలు చేపట్టారు.

Tags

Next Story