వాడవాడకూ ఫోన్ చార్జింగ్ పాయింట్లు.. రంగంలోకి వెయ్యి మంది టెక్నీషియన్లు
వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల నిమిత్తం 1000 మంది టెక్నీషియన్లను రంగంలోకి దింపామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఎక్కువ నష్టం జరగడంతో ఈపీడీసీఎస్, ఎస్పీడీసీఎల్ నుంచి వివిధ హోదాల్లో ఉన్న సుమారు వెయ్యి మంది విద్యుత్ సిబ్బందిని రప్పించామని తెలిపారు.
వరద ప్రభావం తగ్గిన నాటి నుంచి కరెంట్ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో వీరిని బృందాలుగా మోహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. డిస్కంలకు సంబంధించిన సీఎండీలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతున్నట్లు వివరించారు. పునరావాస కేంద్రా జెనరేటర్ ద్వారా విద్యుత్ అందిస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. 750 లైట్లతో పాటు సెల్ ఫోన్ పాయింట్లు కూడా అమర్చినట్లు వివరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com