ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..!

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..!
X
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వాక్సినేషన్ పూర్తయ్యేవరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు.. పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. పాఠశాలలు తెరిచే ఆలోచన కూడా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Tags

Next Story