Andhra Pradesh: ఒకవైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు కరెంటు కోతలు..

Andhra Pradesh: ఒకవైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు కరెంటు కోతలు..
Andhra Pradesh: ఏపీలో కరెంట్ కోతలు తీవ్రం అవుతున్నాయి. తరచూ కరెంట్ కోతలతో జనం అసౌకర్యానికి లోనవుతున్నారు.

Andhra Pradesh: ఏపీలో కరెంట్ కోతలు తీవ్రం అవుతున్నాయి. తరచూ కరెంట్ కోతలతో జనం అసౌకర్యానికి లోనవుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. పార్వీతీపురం మన్యం జిల్లాలో రాత్రి నుంచి కరెంట్ లేదు. కురుపాం ఏజెన్సీ అంధకారంలోకి వెళ్లింది. అటు విజయనగరం జిల్లా గణపతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇక ఇవాళ్టి నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రాత్రంతా కరెంట్‌ లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. సెల్‌ఫోన్ ‌లైట్లు, దీపాల సాయంతో పరీక్షలకు సిద్ధమయ్యారు. కరెంట్ కోతలు విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story