Prakasam: ప్రకాశం జిల్లాలో మాస్ కాపీ.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి..

Prakasam: ప్రకాశం జిల్లాలో మాస్ కాపీ.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి..
Prakasam: ప్రకాశం జిల్లాలో జోరుగా టెన్త్‌ మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోంది.

Prakasam: ప్రకాశం జిల్లాలో జోరుగా టెన్త్‌ మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోంది. రాచర్ల, కొమరోలు జడ్పీ హైస్కూళ్లలో విద్యార్ధుల తల్లిదండ్రులు మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఓ పక్క అధికారులు పరీక్షల్ని కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నా.. తల్లిదండ్రులు మాత్రం దీన్ని బేఖాతరు చేస్తూ మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. రాచర్లలో తమ పిల్లలకు వచ్చిన క్వశ్చన్‌ పేపర్‌ ఆధారంగా.. ఆన్సర్‌ కాపీలను సిద్దం చేసి పిల్లలకు అందిస్తున్నారు.

పరీక్ష కేంద్రం సమీపంలో గుంపులుగా ఏర్పడి ఆన్సర్లు తయారు చేస్తున్నారు. అటు కొమరోలులోని పరీక్ష కేంద్రం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇంటర్‌ విద్యార్ధులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. వీరిసెల్‌ఫోన్లో క్వశ్చన్‌ పేపర్‌ను గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 12 మందిని అదుపులో తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు

Tags

Read MoreRead Less
Next Story