AP : పింఛన్ల కోసం రూ.12,508 కోట్ల ఖర్చు: సీఎం చంద్రబాబు

AP : పింఛన్ల కోసం రూ.12,508 కోట్ల ఖర్చు: సీఎం చంద్రబాబు

అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం రూ.12,508 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘1వ తేదీనే 98% మంది లబ్ధిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 64.38 లక్షల మందికి పింఛను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ పడనుంది. తొలిరోజైన నిన్న రాత్రి 8 గంటల వరకు 97.65 శాతం పంపిణీ పూర్తయింది. 64.38 లక్షల మందికి గాను 62.90 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. 1వ తేదీ పబ్లిక్ హాలిడే/ఆదివారం వస్తే ఆ ముందు రోజు, 2న హాలిడే/ఆదివారం వస్తే ఆ తర్వాతి రోజు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గురువారం పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

Tags

Next Story