AP Corona : ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 12,615 పాజిటివ్ కేసులు
AP Corona : ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజూ పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 47వేల 420 శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 12వేల 615 కేసులు వచ్చాయి. విశాఖలో ముగ్గురు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు.
మరో 3674 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం ఏపీలో 53వేల 871 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తమ బులెటిన్‌లో పేర్కొంది. కాగా చిత్తూరు, విశాఖలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఈ రెండు జిల్లాల నుంచే ఎక్కువగా కేసులు వెలుగు చూస్తున్నాయి.
చిత్తూరులో 2338, విశాఖలో 2117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో వెయ్యి చొప్పున కరోనా కేసులు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కనిష్టంగా 216 కేసులు నమోదయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com