ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు.. ఐదుగురు మృతి
24 గంటల్లో కొత్తగా 13 వందల 26 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కొత్తగా 13 వందల 26 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మరో ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 282 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 271, విశాఖలో 222 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే నెల్లూరులో 171, కృష్ణా జిల్లాలో 138, ప్రకాశంలో 54 మంది కరోనా బారినపడ్డారు. ఇక కరోనా నుంచి 911 మంది పూర్తిగా కోలుకోగా.... ప్రస్తుతం ఏపీలో 10 వేల 710 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 7 వేల 244 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9 లక్షల 9వేల 2కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story