AP Corona Cases : ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు

AP Corona Cases : ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
X
AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు.. మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 14 వందల 35 కేసులు నమోదయ్యాయి.

AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు.. మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 14 వందల 35 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లోనే ఆరుగురు కరోనా కారణంగా మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20 లక్షలు దాటాయి. ఒక్క రోజులోనే చిత్తూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 702 మంది వైరస్‌ బారినపడి మరణించారు. ఇక ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం 15 వేల 472 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య శాఖ తెలిపింది.

Tags

Next Story