Ap corona : ఏపీలో కొత్తగా 14,502 కేసులు, ఏడుగురు మృతి

Ap corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 14వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 40వేల 266 శాంపిల్స్ పరీక్షించగా, 14వేల 502 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరిలో ఇద్దరు... గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కాగా 4వేల 8 వందల మంది కోవిడ్ నుంచి కోలుకోగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష చేరువలోకి వచ్చాయి. విశాఖ జిల్లా నుంచి అత్యధికంగా 1728 కేసులు వెలుగు చూడగా... అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com