Ap Corona : ఏపీలో కొత్తగా 1,546 కేసులు.. 18 మరణాలు..!

X
AP Corona Cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 69,606 పరీక్షలు నిర్వహించగా.. 1,546 కేసులు బయటపడ్డాయి. దీనితో తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19,71,554కి చేరింది. అటు కరోనాతో మరో 18 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 13,428కి చేరింది. మరోవైపు కరోనా నుంచి 1,940 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,170 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
