AP Corona Cases : ఏపీలో కరోనాతో 104మంది మృతి..!

AP Corona Cases : ఏపీలో కరోనాతో  104మంది మృతి..!
AP Corona Cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 84,224 కరోనా పరీక్షలు చేయగా 16,167 కేసులు బయటపడ్డాయి.

AP Corona Cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 84,224 కరోనా పరీక్షలు చేయగా 16,167 కేసులు బయటపడ్డాయి. మరోవైపు కరోనాతో పోరాడుతూ 104మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16,43,557కు చేరింది. ఇక కరోనా నుంచి 21,385మంది కోలుకున్నారు. దీనితో మొత్తం 14,46,244 మంది కరోనా నుంచి బయటపడ్డారు. అటు మృతుల సంఖ్య 10,531కి చేరింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,86,728 యాక్టివ్‌ కేసులున్నాయి.. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story