Visakhapatnam : సిగరెట్ కోసం స్నేహితుడి హత్య

Visakhapatnam : సిగరెట్ కోసం స్నేహితుడి  హత్య
గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసి..

విశాఖపట్నంలోని ఓ మైనర్ బాలుడి హత్య కేసును పోలీసుల ఛేదించారు. సిగరెట్ కోసం చెలరేగిన వివాదం ఓ హత్యకు దారితీసింది. స్నేహితులే అతడిని పొట్టనపెట్టుకున్నారు. విశాఖలో ఇటీవల జరిగిన ఈ ఉదంతం కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చిన్న తనంలోనే వ్యసనాలకు బానిసైన కొంతమంది పిల్లలు. ఓ రౌడీ షీటర్‌ను ఆదర్శంగా తీసుకుని చెడు వ్యసనాలకు, మత్తు పదార్ధాలకు అలవాటు పడ్డారు. సిగరెట్‌ కోసం వారి మధ్యలో ఘర్షణ చోటుచేసుకుంది. క్షణికావేశంలో తమలో ఒకడి గొంతుకోసి హతమార్చాడు. అనంతరం మృత దేహాన్ని సముద్రంలో విసిరేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అనూహ్యం ఈ విషయం వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏవీఎస్ కళాశాల సమీపంలో నూకాలమ్మ అనే మహిళ తన కుమారుడు చిన్నాతో కలిసి నివసిస్తోంది. స్నేహితులతో కలిసి చిన్నా వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నెల 20న స్నేహితులతో కలిసి అతడు ఉత్సాహంగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. అర్ధరాత్రి దాటాక మరో నలుగురు స్నేహితులతో కలిసి సిగరెట్లు తాగాడు. ఈ క్రమంలో వారి మధ్య సిగరెట్ కోసం గొడవ మొదలైంది. ఆవేశంలో అదుపు కోల్పోయిన స్నేహితులు చిన్నా గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత అతడి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి దాచారు. మరుసటి రోజు తెల్లవారుజామున వినాయకచవితి సామాగ్రి తరలించడం కోసం ఓ ఆటో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే చిన్నా మృతదేహాన్ని కూడా ఆటోలో చేపల చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ సముద్రంలో విసిరేశారు. చిన్నా మృతదేహం పోలీసులకు లభించడంతో వారు ఆటోడ్రైవర్‌ను వెతికిపట్టుకుని విచారించారు. దీంతో, అతడు ఆ నలుగురు పిల్లల గురించి పోలీసులకు చెప్పాడు. పోలీసులు చిన్నాను చంపిన నలుగురు టీనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఆ నలుగురినీ జువైనల్‌ హోంకు తరలించారు. జువైనల్ హోంకు తరలించారు.


Tags

Read MoreRead Less
Next Story