ఏపీలో మొదటిరోజు 18 గంటల కర్ఫ్యూ విజయవంతం
ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన 18 గంటల కర్ఫ్యూ మొదటి రోజు విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో 18 గంటల కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేశారు పోలీసులు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యకలాపాలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సర్వీసులు మినహాయించి ప్రజా రవాణా సహా అన్ని నిలిచిపోయాయి. కొన్ని చోట్ల వ్యాపారులే స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ పాటించాయి. పలు దుకాణాల్ని పోలీసులు దగ్గరుండి మూసివేయించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరినీ బయటకు అనుమతించకపోవడంతో రోడ్లు, ప్రధాన కూడళ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి.
Next Story