AP corona cases : ఏపీలో కొత్తగా 1,859 కేసులు.. 13 మరణాలు

X
AP corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70,757 కరోనా టెస్టులు చేయగా 1,859 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,88,910కి చేరింది. ఇక కరోనాతో మరో 13 మంది మృతి చెందారు. దీనితో ఆ సంఖ్య 13,595కి చేరింది. అటు 1,575 మంది కొత్తగా కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 19,56,627కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,688 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
