Khammam: ఖమ్మం జిల్లాలో విషాదం.. గుడిలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు చిన్నారులు మృతి..

X
Khammam: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోకి దూసుకెళ్లింది. అక్కడ భజన చేస్తున్న ముగ్గురు చిన్నారులను ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పల్లిపాడు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారిని కళ్యాణం అనంతరం ఊరేగించి గుడిలో భజనలు చేస్తున్న సందర్బంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
