AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,345 కరోనా కేసులు

AP Corona Cases
AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,345 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 19,34,450కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 16 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 13,097 మంది మృతి చెందారు. ప్రస్తుతం 24, 854 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 18,96,499 మంది కోలుకున్నారు. ఏపీలో 24 గంటల్లో 3,001 మంది రికవరీ అయ్యారు.
గుంటూరు జిల్లాలో ముగ్గురు, విశాఖ జిల్లాలో ఒకరు మృతి కరోనా బారిన పడి మరణించారు. తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,33,96,437 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com