ఒకే ఫ్రేమ్‌లో 25 కవల జంటలు..!

కవలలు కళ్ల ముందు కనిపిస్తే వారిని గుర్తు పట్టడమే చాలా కష్టం. అలాంటి ఒకేసారి 25 కవల జంటలు ఒకే చోట చేరితే కన్ఫ్యూజన్‌లో ఉండిపోతాం. ఈ అరుదైన ఘటనకు విశాఖ నగరం వేదికైంది. ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా 25 కవల జంటలు ఒకే చోట కలిసి సందడి చేశారు. అంతేకాదు వారిలో ఉన్న కళలను ప్రదర్శించారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు..అంతా కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఒకే పోలికలతో ఉన్న జోడిలను చూసి అక్కడి వారు మైమరచిపోయారు.
ట్విన్స్ అందరూ ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండి.. ప్రతి ఏడాది కలుస్తుంటారు. కానీ 2020లో కరోనా కారణంగా వారి సంబరాలకు బ్రేక్ పడింది. ఈ ట్విన్స్ మీటింగ్‌లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అన్ని వయసుల వారు ఉత్సాహంగా సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఎంజాయ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com