ఏపీలో కొత్తగా 2,558 కోవిడ్ పాజిటివ్ కేసులు..ఆరుగురు మృతి

ఏపీలో కొత్తగా 2,558 కోవిడ్ పాజిటివ్ కేసులు..ఆరుగురు మృతి
ఏపీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు రెట్టింపు స్థాయిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2 వేల 558 కరోనా కేసులు నమోదయ్యాయి

ఏపీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు రెట్టింపు స్థాయిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2 వేల 558 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 915 మంది కోవిడ్ బారి నుండి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 31 వేల 268 శాంపిల్స్‌ని పరీక్షించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోటి 53 లక్షల 33 వేల 851 శాంపిల్స్‌ను పరీక్షించారు.

ఇక రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 465 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూడగా.. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యుల్పంగా 37 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 399, కర్నూలు 344, విశాఖలో 290, అనంతపురం 131, తూర్పుగోదావరి 58, కడప 94, క్రిష్ణా 152, నెల్లూరు 204, ప్రకాశం 153, శ్రీకాకుళం 185, విజయనగరం జిల్లాలో 46 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గుంటూరు, కృష్ణ, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఆరుగురు మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story