చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

X
By - kasi |3 Nov 2020 5:44 PM IST
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మదనపల్లి సమీపంలోని బండకిందపల్లి వద్ద జరిగింది . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను మదనపల్లి ఆస్పత్రికి తరలించారు.కాగా ప్రమాదంలో మృతి చెందిన వారిని గంగుల్లప్ప, సోమశేఖర్ మల్లికార్జునగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com