అనంతపురంలో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

అనంతపురంలో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి శివార్లలో క్రూయిజర్‌ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

అనంతపురం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి శివార్లలో క్రూయిజర్‌ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రూజయిల్ ముందు బాగం నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో అందులో 10 మంది ఉండగా.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి స్వల్పగాయలు అయ్యాయి. ఈ వాహనంలో ఉన్నవారంతా తాడిపత్రికి చెందినవారే అని పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Tags

Read MoreRead Less
Next Story