WHO: భారత్‌లో 30 శాతం మహిళలపై హింస

భారత్‌లో 2023 సంవత్సరంలో 15-49 ఏళ్ల వయసు గల మహిళల్లో ఐదో వంతు మంది సన్నిహిత భాగస్వామితో హింసకు గురవ్వగా, దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో ఈ సమస్య బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. నవంబరు 25న ‘మహిళలు, బాలికలపై హింస నిర్మూలన దినోత్సవం’ సందర్భంగా ప్రపంచ వ్యాప్త పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో నివేదిక విడుదల చేసింది. ‘ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు, మొత్తంగా 84 కోట్ల మంది వారి జీవితకాలంలో లైంగిక హింస ఎదుర్కొన్నారు. 2000 నుంచి ఈ సంఖ్యలో పెద్దగా మార్పులేదు. ప్రపంచంలో 15-49 సంవత్సరాల వయసు గల మహిళల్లో 8.4 శాతం మంది భాగస్వామి కాని వ్యక్తుల నుంచి లైంగిక హింసకు గురవుతున్నారని అంచనా. భారత్‌లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల్లో దాదాపు 4 శాతం మంది భాగస్వామి కాని వ్యక్తుల నుంచి లైంగిక హింసను ఎదుర్కొంటున్నారని అంచనా’ అని నివేదిక తెలిపింది. ‘మహిళలపై హింస మానవాళిలో అత్యంత పురాతన, విస్తృత అన్యాయాల్లో ఒకటి. ఇప్పటికీ అతి తక్కువగా పరిష్కార చర్యలు తీసుకుంటున్న వాటిలో ఒకటి’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు. మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం ఐచ్ఛికం కాదని.. శాంతి, అభివృద్ధి, ఆరోగ్యానికి ఇది తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.
నేడు అంతర్జాతీయ 'మహిళలు, బాలికల హింస నిర్మూలన దినోత్సవం' నేపథ్యంలో ప్రచురించిన నివేదికలో పరిశోధకులు చెప్పారు. మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం ఆప్షన్ కాదని, శాంతితో పాటు ఆరోగ్యానికి, అభివృద్ధికి ఇది ఒక అవసరం అని అభిప్రాయపడ్డారు. 2030 నాటికి మహిళలు, బాలికలపై జరిగే అన్ని రకాల హింసను నిర్మూలించాలనే లక్ష్యాన్ని సాధించడం కష్టమేనని అంచనా వేశారు. మానవతా సంక్షోభాలు, పర్యావరణ వైపరీత్యాలు సమయంలో మహిళలపై హింసను నివారించడానికి ఉద్దేశించిన నిధుల్లో కూడా తగ్గుదల ఉందని నివేదికలో వెల్లడించారు.
సామాజిక హింస..
కర్ణాటకలోని ‘ధర్మస్థల’ సంఘటన రెండు దశాబ్దాల్లో అనేకమంది స్త్రీలని హత్యచేసి, మృతదేహాల్ని పూడ్చిపెట్టడం. ఇది తానే చేసినట్లు ఒక విశ్రాంత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అవన్నీ అనుమాన్నాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. మణిపూర్‌లో ఒక తెగకు చెందిన స్త్రీలను 2024లో నడివీధుల్లో నగంగా ఊరేగించి, అత్యాచారాలు చేసి, చంపేశారు. నేతల వికృత క్రీడకు వారిని బలి చేశారు. మనదేశంలో ఆశారామ్లు, డేరా బాబాల పేరిట, ఆశ్రమాల ముసుగులో స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలు అనేకం.
మౌనంగా భరించొద్దు
మహిళలపై జరుగుతున్న హింసాత్మక చర్యలను మౌనంగా భరించకుండా అందుబాటులో ఉన్న భరోసా, సఖి కేంద్రాలను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం డయల్ 100తో పాటు ఉమెన్ హెల్ప్‌లైన్ 1091, జాతీయ మహిళా కమిషన్ 7827170170కు ఫోన్ చేయొచ్చని సలహా ఇస్తున్నారు. మహిళలపై జరిగే హింస, దోపిడీని, బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి హైదరాబాద్ కేంద్రంగా మై ఛాయిసెస్ ఫౌండేషన్ పని చేస్తోంది. మైనర్ పెళ్లిళ్లు, సెక్స్ ట్రాఫికింగ్ విషయాల్లో సాయం కోసం 18004198588 నంబరుకు, గృహహింస బాధితులు రక్షణకోసం 18002129131కు మిస్డ్‌కాల్ ఇచ్చినా సరిపోతుంది. 24 గంటల్లోగా ఈ సంస్థ ‘పీస్ మేకర్లు’ మిమ్మల్ని చేరుకుని, దేశంలో ఏ మూలన ఉన్నా, స్థానిక ఎన్జీవోల సాయంతో ఆపద నుంచి బయట పడేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

