ఏపీలో కొత్తగా 4,228 కేసులు, 10 మంది మృతి..!

ఏపీలో కొత్తగా 4,228 కేసులు, 10 మంది మృతి..!
ఏపీలో కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది.. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా వుంది.. గడిచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 4వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది.. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా వుంది.. గడిచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 4వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. 24 గంటల్లో రాష్ట్రంలో 4వేలా 228 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. పది మంది కరోనాతో చనిపోయారు. చిత్తూరు జిల్లాలోనే నలుగురు చనిపోగా.. నెల్లూరులో ఇద్దరు మృతిచెందారు.. ఇక గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో చనిపోయారు.

పాజిటివ్‌ కేసుల్లోనూ చిత్తూరు టాప్‌లో ఉంది.. 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 842 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. గుంటూరు జిల్లాలో 622 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 538 కేసులు నమోదయ్యాయి. విశాఖలో 414, కడపలో 334 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి..

Tags

Next Story