AP : ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయింపు..ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే!

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
▪️నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతిచ్చింది.
ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
▪️సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్ కు 500 మెగావాట్లు, వైఎస్సార్ కడప జిల్లా కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
ఎకరానికి రూ.5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
▪️2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం.
▪️హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం.
▪️విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి అనుమతి.
▪️అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం.
▪️దుకాణాల ద్వారా రేషన్, ఇతర సరకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ.
▪️భోగాపురం వద్ద 500 ఎకరాలు కేటాయించే మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం.
▪️ఏపీ లెదర్ పుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం.
▪️పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్ ఆమోదం.
▪️రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం మంత్రివర్గ అజెండాలోని అంశాల తర్వాత తాజా పరిణామాలపై చంద్రబాబు చర్చించారు.
మద్యం స్కామ్ పై విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.
ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలను తావివ్వొద్దని మంత్రులకు సూచించారు.
ప్రధాని ఆధ్వర్యంలో జరిగే యోగా డేను విజయవంతం చేయాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com