Ap Corona : ఏపీలో కొత్తగా 7,224 కరోనా కేసులు, 15 మంది మృతి..!

Ap Corona : ఏపీలో కొత్తగా 7,224 కరోనా కేసులు, 15 మంది మృతి..!
ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే కొత్తగా 7వేల 224 కేసులు నమోదు కాగా... 15 మంది మృతి చెందారు.

ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే కొత్తగా 7వేల 224 కేసులు నమోదు కాగా... 15 మంది మృతి చెందారు. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 9లక్షల 55వేల 455కు, కరోనా మరణాల సంఖ్య 7వేల 388కి చేరింది. రాష్ట్రంలో 35వేల 592 యాక్టివ్‌ కేసులు ఉండగా 9లక్షల 7వేల 598 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

కడప, కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో కరోనాతో మరణించారు. ఏపీలో గడచిన 24 గంటల్లో చిత్తూరులో అత్యధికంగా 1051 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 906, గుంటూరులో 903, కర్నూలులో 550, శ్రీకాకుళంలో 662 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 624, ప్రకాశంలో 588 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖా బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story