విజయవాడలో 72వ గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్

విజయవాడలో 72వ గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, డీజీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ ప్రజలకు గవర్నర్‌ బిశ్వ భూషన్ హరిచందన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసుకోవాలని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ శాంతి, అహింసలకు కట్టుబడి సోదర భావంతో మెలగాలని తెలిపారు. ప్రతి వ్యక్తీ దేశ నిర్మాణానికి కృషి చేయాలన్నారు గవర్నర్‌ హరిచందన్.

Tags

Next Story