CM Chandrababu : 74 ప్రాజెక్టుల పనులు స్టార్ట్ అయ్యాయి - చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం రూ.81,317 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. రాజధాని నిర్మాణ పురోగతిపై సీఎం సమీక్షించారు. ఇప్పటికే రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని, 74 ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని సీఎం తెలిపారు.
నిర్మాణ పనుల వివరాలు:
హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ల్యాండ్ పూలింగ్ స్కీం (LPS) కింద మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్ట్‌లు, వరద నియంత్రణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని చంద్రబాబు వివరించారు. రికార్డు సమయంలో రాజధాని నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా అమరావతిని దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com