CM Chandrababu Naidu : పెన్షన్ల పంపిణీపై 90% మంది సంతృప్తి : సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : పెన్షన్ల పంపిణీపై 90% మంది సంతృప్తి : సీఎం చంద్రబాబు
X

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పింఛన్లు, దీపం పథకం, అన్న క్యాంటీన్, ఇసుక సరఫరాతోపాటు ఉద్యోగుల తీరుపై ఆయన ఆరా తీశారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో వారి అంచనాల మేరకు పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు.

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై 90% మంది సంతృప్తిగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ధాన్యం సేకరణలో 89.92% మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. దేవాలయాల్లో దర్శనాలపై 70% మంది సంతృప్తి, వసతులపై 37% మందిలో అసంతృప్తి నెలకొందని తెలిపారు. ఆస్పత్రుల్లో సేవలపై 35% మంది అసంతృప్తి, అవినీతిపై 37% ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై IVRS, వివిధ రూపాల్లో చంద్రబాబు అభిప్రాయం సేకరించారు.

మరోవైపు అందరికీ ఇళ్లు’ పథకం పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుండగా, స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి. ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఆధార్, రేషన్‌కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుండగా, రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Tags

Next Story