95వ రోజు విజయవంతంగా యువగళం

95వ రోజు విజయవంతంగా యువగళం
ఉమ్మడి కర్నూలులో యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది

ఉమ్మడి కర్నూలులో యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ 95వ రోజు ఉదయం 7 గంటలకు గార్గేయపురం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. 8 గంటల 10 నిమిషాలకు నందికొట్కూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం ఎంట్రీ కానుంది. 8.15కి బ్రాహ్మణకొట్కూరులో ఎస్సీలతో సమావేశం కానున్నారు. 8.40కి బ్రాహ్మణకొట్కూరు శివాలయం వద్ద ముస్లింలతో లోకేష్ సమావేశం అవుతారు.

9 గంటలకు కోళ్లబోవపురం క్రాస్‌ వద్ద ఎస్టీలతో, 9.40కి వడ్డేమూరులో బోయలతో సమావేశం కానున్నారు. అనంతరం 10 గంటలకు కోనేటమ్మపల్లి క్రాస్‌ వద్ద సర్పంచ్‌లతో, 10.40కి అల్లూరులో గొళ్ల సామాజికవర్గీయులతో లోకేష్ భేటీ కానున్నారు. 11.10కి అల్లూరులో 1200 కిలోమీటర్ల మైలురాయి చేరుకోనుంది యువగళం పాదయాత్ర. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించనున్నారు యువనేత నారా లోకేష్‌. అనంతరం ఉదయం 11.25కి అల్లూరు శివార్లలో భోజన విరామం తీసుకుంటారు.

భోజన విరామం తర్వాత సాయంత్రం 4 గంటలకు అల్లూరు శివార్ల నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. 5.30కి నందికొట్కూరులోని ఎన్‌ఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద బహిరంగసభలో పాల్గొంటారు. 6.45కి మార్కెట్‌ యార్డు సర్కిల్‌లో రైతులతో లోకేష్‌ సమావేశం కానున్నారు. రాత్రి 7.10కి సుంకాలమ్మ దేవాలయం వద్ద డ్రైవర్స్‌ యూనియన్‌ ప్రతినిధులతోను, 7.25కి పటేల్‌ సెంటర్‌లో గౌడ సామాజికవర్గీయులతో భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 7.55కి నందికొట్కూరు శివారు విడిది కేంద్రంలో నారా లోకేష్ బస చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story