ఓటు వేసి వచ్చిన కొద్దిసేపటికే కన్నుమూసింది!

ఓటు వేసి వచ్చిన కొద్దిసేపటికే కన్నుమూసింది!
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి ఇంటికి వచ్చిన ఓ వృద్ధురాలు కన్నుమూసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

ఏపీలో తొలి దశ పోలింగ్ ముగిసింది. ఉదయం ఆరున్నర గంటలకు మొదలైన పోలింగ్ .. కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే.. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి ఇంటికి వచ్చిన ఓ వృద్ధురాలు కన్నుమూసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎల్.ఎన్ పేట మండలం ఫోక్స్ దర్ పేటకు చెందిన గొలివి గోవిందమ్మ(90) అనే వృద్ధురాలు పంచాయితీ ఎన్నికల్లో ఓటు వేసి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మృతి చెందింది.

Tags

Next Story