Ap Government : జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ

Ap Government : జగన్ సర్కార్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు ట్రెజరీ ఉద్యోగులు కూడా సహాయ నిరాకరణకు దిగారు. బిల్లులు ప్రాసెస్ చేసేది లేదంటూ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తామూ ఉద్యమంలోనే ఉన్నామని.. ప్రాసెస్ చేయడం కుదరదని స్పష్టం చేశారు.. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు జీవోలు కూడా జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం.. ఈ నెల 25 లోగా వేతనాలను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ట్రెజరీ అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. అయితే.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలను ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ అధికారులు, డ్రాయింగ్ అధికారులు కూడా నిరాకరించారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని వారు అంటున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లిస్తూ.. జీతం పెరిగినట్లు బిల్లు చేయడానికి ట్రెజరీ ఉద్యోగులు నిరాకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com