Chittoor: పెళ్లి ఇంట విషాదం నింపిన రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడిపోయిన బస్సు..

Chittoor: పెళ్లి ఇంట విషాదం నింపిన రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడిపోయిన బస్సు..
Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భాకరాపేట వద్ద పెళ్లిబస్సు.. దాదాపు 300 అడుగుల లోయలో పడిపోయింది.

Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భాకరాపేట వద్ద పెళ్లిబస్సు.. దాదాపు 300 అడుగుల లోయలో పడిపోయింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ప్రైవేటు బస్సులో తిరుపతికి నిశ్చితార్ధానికి వెళ్తుండగా..ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 8 మందిచనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో... బస్సులో పెళ్లి కొడుకు వేణుతో పాటు 55మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పనాయుడు సహాయకచర్యల్ని పర్యవేక్షించారు.చీకటిగా ఉండటంతో.. సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. మూడు అంబుల్స్‌లు, ఫైర్‌ ఇంజన్లు ఘటానాస్థలికి చేరుకున్నాయి.

దారిలో వెళ్ళే తోటి వాహనదారులు.. క్షతగాత్రుల్ని కాపాడి తమ మానవత్వం చాటుకున్నారు. క్షతగాత్రులను తిరుపతి రూయా, స్విమ్స్‌ ఆసుపత్రులకు తరలించారు. అటు కలెక్టర్‌ సైతం ఆసుపత్రి వద్దకు చేరుకుని.. బాధితుల్ని పరామర్శించారు ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో సహా 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఆరుగురికి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు క్షతగాత్రులు చెబుతున్నారు. .

అనంతపురం జిల్లా ధర్మవరంంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇవాళ ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీంతో వేణు కుటుంబం ధర్మవరం నుంచి నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు 55 మందితో ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరింది.

చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద అందరూ భోజనాలు చేశారు. అనంతరం 9 కి.మీ ప్రయాణించి భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం జరిగింది. డ్రైవరు అతి వేగంగా నడపటంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. క్షతగాత్రుల రోదనలు, మృత దేహాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల్లో 8మంది పిల్లలు సహా వృద్ధులున్నారు.

చిత్తూరు జిల్లా భాకరాపేట ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు.. పెళ్లింట జరిగిన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ.. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ప్రధాని.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తునట్లు పేర్కొన్నారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షలు.. క్షతగాత్రులకు 50వేల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story