Prakasam: పావురం కాలికి కోడ్.. చైనా నుండి వచ్చిందంటూ అనుమానాలు..

Prakasam: పావురం కాలికి కోడ్.. చైనా నుండి వచ్చిందంటూ అనుమానాలు..
Prakasam: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ పావురం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.

Prakasam: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ పావురం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.. కాలికి రబ్బర్‌ ట్యాగ్‌తో ఓ పావురం చీమకుర్తిలో ప్రత్యక్షమైంది.. అయితే, ఇది ఎక్కడ్నుంచి వచ్చింది..? ఎవరు పంపారు అనేది తెలియరాలేదు.. కానీ, స్థానికులు మాత్రం ఇది చైనా పావురమని చెప్పుకుంటున్నారు. ఎక్కడ్నుంచో ఎగిరొచ్చిన పావురం చీమకుర్తి నెహ్రూనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వాసికి చిక్కింది..

పావురాన్ని పరిశీలించిన యువకుడు కాలికి రబ్బర్‌ ట్యాగ్‌ను గుర్తించాడు.. ఈ ట్యాగ్‌పై ఎయిర్‌ అని ఇంగ్లీష్‌ లెటర్స్‌లో ఉంది.. దానికి 2019.. ఆ పక్కనే 2207 అనే కోడ్‌ కనిపించింది.. దీంతో ఇదేదో గూఢచారులు పంపించిందిగా చెప్పుకుంటున్నారు. ఇటీవల ఒడిశాలో కూడా ఇలాంటి పావురాలే కలకలం రేపాయి.. కటక్‌ జిల్లాలోని దశరథ్‌పూర్‌, పూరి జిల్లా హరికృష్ణాపూర్‌లోని రహంగియా గ్రామంలోనూ ఇదే తరహా పావురాలు కనిపించాయి..

అయితే, అందులో ఒకదానికి చైనా అక్షరాలతో కూడి అల్యూమినియం ట్యాగ్‌, ఇంకో పావురానికి 37 అంకెలతో కూడిన ట్యాగ్‌ కనిపించింది.. వీటిని పోలీసులు స్వాధనం చేసుకోగా.. తాజాగా చీమకుర్తిలో కలకలం రేపిన పావురం కూడా అలాగే ఉంది.. అయితే, కొన్నాళ్లుగా ఈ పావురం ఇక్కడే తిరుగుతోందని స్థానికులు చెప్తున్నారు.. కాలికి ట్యాగ్‌ కనిపించడంతో పట్టుకున్నామని అంటున్నారు.. మొత్తానికి ఈ పావురం వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు.. ఈ ట్యాగ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story