Kadapa : ఖాకీ చొక్కా అడ్డుపెట్టుకుని అందిన చోటల్లా అప్పులు.. ఫైర్ కానిస్టేబుల్ దాష్టికం..!

Kadapa : అతనో ప్రభుత్వ ఉద్యోగి.. వేల రుపాయల జీతం.. అన్ని సౌకర్యాలూ అదనం.. అయినా పక్కవాడి సొమ్ముపై కన్ను...ఖాకీ చొక్కా అడ్డుపెట్టుకుని అందిన చోటల్లా అప్పులు.. తిరిగి అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటూ ఖాకీ కావరం. ఇది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఫైర్ కానిస్టేబుల్ శ్రీనివాసులు తీరు. ఆర్‌ఎస్ రోడ్డులోని కరుణాకర్ కిరాణా కొట్టులో జీతం వచ్చిన వెంటనే ఇస్తానంటూ దాదాపు 20వేలకు పైగా సరుకులు తీసుకున్నాడు. బాకీ చెల్లించాలంటూ అడిగితే రేపుమాపు అంటూ తిప్పుకున్నాడు. చివరకు దిక్కున్నచోట చెప్పుకోమంటూ కావరం ప్రదర్శించాడు. దీంతో దుకాణాదారు.. కోడూరులోని ఫైర్ కార్యాలయానికి వచ్చి కానిస్టేబుల్ కాళ్లు పట్టుకున్నా కనికరం చూపకుండా విదిలించుకుని వెళ్లిపోయాడు. ఇలాగే మరికొన్ని దుకాణాల్లోనూ కానిస్టేబుల్ అప్పులు చేసినట్లు బాధితులు వాపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com