Vizianagaram: ఏనుగుల దాడిలో ఫారెస్ట్ ఆఫీసర్ మృతి.. ఏకంగా తలపై కాలితో తొక్కి..

Vizianagaram: ఏనుగుల దాడిలో ఫారెస్ట్ ఆఫీసర్ మృతి.. ఏకంగా తలపై కాలితో తొక్కి..
Vizianagaram: విజయనగరం జిల్లా కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Vizianagaram: విజయనగరం జిల్లా కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో అటవీశాఖ ఉద్యోగి మృతి చెందాడు. అటవీశాఖలో ఏనుగులను తరలించే ట్రాకర్‌గా పని చేస్తున్న రాజు.. రాత్రి ఏనుగులు చొరబడ్డాయనే సమాచారంతో వాటిని తరలించేందుకు వెళ్లారు.

అయితే అక్కడ రేకుల షెడ్డును కూల్చేసున్న ఏనుగు దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న బోరుబావి గట్టును తన్నుకుని పడిపోవడంతో.. రాజుపై ఏనుగు దాడి చేసింది. అతని తలపై కాలితో తొక్కడంతో తీవ్ర గాయాలపాలైన రాజు.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా సీతంపేట గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.

గత నాలుగేళ్లగా ఏనుగుల దాడిలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. మరి కొంతమంది గాయాలపాలయ్యారు. ఏనుగులు ఎప్పుడు చొరబడి దాడి చేస్తాయో తెలియక అక్కడి ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అధికారులపైనా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఫారెస్ట్‌ అధికారులు వెంటనే ఏనుగుల గుంపును శాశ్వతంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story