Vizianagaram : వాలంటీర్ ఓవరాక్షన్.. వృద్దుడి పెన్షన్ నిలిపివేత

Vizianagaram : వైసీపీ పాలనలో వాలంటీర్ల ఓవరాక్షన్ ఎక్కువైపోయింది.. పేదవాళ్లు సమస్యల గురించి చెప్పినా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంగా ముద్ర వేసి వారికి పథకాలు రానివ్వకుండా చేస్తున్నారు.. నిత్యావసర ధరలు అధికంగా ఉన్నాయని విజయనగరం జిల్లాలో ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేయగా.. ఇవాళ ఆమె భర్తకు పెన్షన్ నిలిపివేశాడు వాలంటీర్.. ఈ ఘటన బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
అయితే, బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ మురళీ కృష్ణ చెప్తేనే పెన్షన్ ఇస్తామంటున్నాడు వాలంటీర్ నాగరాజు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాలంటీర్ కోసం పడిగాపులు కాసినా పెన్షన్ ఇవ్వలేదని రిక్షా కార్మికుడు రాము వాపోయాడు.. నాలుగు రోజుల క్రితం గొల్లపల్లి గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో తమ బాధను తెలియజేసింది మరిపి లక్ష్మి.. వైసీపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరల మంటపై వాపోయినందుకు కక్షపూరితంగా ఇలా పెన్షన్ ఇవ్వలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com