వృద్ధురాలికి కరోనా.. బయటకు గెంటివేసిన ఇంటి యజమాని..!

వృద్ధురాలికి కరోనా..  బయటకు గెంటివేసిన ఇంటి యజమాని..!
కరోనా కష్టకాలంలో కొందరు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా వచ్చిందని 65 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి యజమాని అమానుషంగా నడిరోడ్డు మీదకు నేట్టివేశాడు.

కరోనా కష్టకాలంలో కొందరు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా వచ్చిందని 65 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి యజమాని అమానుషంగా నడిరోడ్డు మీదకు నేట్టివేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. బొజ్జ సామ్రాజ్యం అనే 65 ఏళ్ల వృద్ధురాలు అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఉన్న ఒక్క కొడుకు సొంత ఇంటని అమ్మేసి తల్లిని ఒంటరిగా వదిలేసి వెళ్లాడు. పెన్షన్ డబ్బులతో అద్దె ఇంట్లో బతుకుతోంది. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుసుకున్న ఓనర్.. సామాన్లతో పాటు బామ్మను బయట పడేశాడు. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ఆరుబయట దీనావస్థలో పడి ఉండటంతో విషయం తెలుసుకున్న అధికారలు ఆమెను ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.

Tags

Next Story