Nellore: వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పోయిన ప్రాణం.. యాక్సిడెంట్ అయినా పట్టించుకోకపోవడంతో..

Nellore: వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పోయిన ప్రాణం.. యాక్సిడెంట్ అయినా పట్టించుకోకపోవడంతో..
Nellore: నెల్లూరు జిల్లా కావలిలో వైద్య సిబ్బంది కొరత, నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Nellore: నెల్లూరు జిల్లా కావలిలో వైద్య సిబ్బంది కొరత, నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యక్తిని ఆస్పత్రిలో స్ట్రెచర్‌పై పడుకోబెట్టి వదిలేయడంతో.. ఆ బాధ భరించలేక బెడ్‌పై నుంచి కిందపడ్డాడు. అప్పటికే తీవ్ర గాయాలైన ఆ యువకుడు.. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. కావలి పీజీ సెంటర్‌లో రెండు బైక్‌లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వీరిని 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాని, ఎమర్జెన్సీ వార్డుకు తరలించడానికి ఆస్పత్రిలో సిబ్బంది లేకపోవడంతో.. 108 వాళ్లు, పిల్లలు కలిసి మోసుకెళ్లారు. గాయపడిన వ్యక్తికి సకాలంలో చికిత్స అందించకపోవడం, సిబ్బంది కొరత, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రాణం పోయిందని ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story