ఆంధ్రప్రదేశ్

Guntur Mother : కొడుకు కర్కషంగా తన్నినా తల్లిప్రేమను చాటుకున్న వృద్ధురాలు..!

Guntur Mother : వృద్ధ్యాప్యంలో ఉన్న కన్నతల్లిపై కొడుకు కాలితో తన్ని చిత్రహింసలకు గురిచేసిన దృశ్యం అందరినీ ఎంతో కలిచివేసింది.

Guntur Mother : కొడుకు కర్కషంగా తన్నినా తల్లిప్రేమను చాటుకున్న వృద్ధురాలు..!
X

Guntur Mother : వృద్ధ్యాప్యంలో ఉన్న కన్నతల్లిపై కొడుకు కాలితో తన్ని చిత్రహింసలకు గురిచేసిన దృశ్యం అందరినీ ఎంతో కలిచివేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి బ్రహ్మానందపురంలో తల్లి పట్ల కసాయి కొడుకు దాష్టీకం.. సభ్య సమాజాన్ని ఆవేదనకు గురిచేసింది. ఎట్టకేలకు పోలీసులు.. ఆ దుర్మార్గుడిని అరెస్టు చేశారు.

అయితే తనను కర్కషంగా కాలితో తన్నినా ఆ వృద్ధురాలు మాత్రం తల్లి ప్రేమను చాటుకుంది. తన కొడుకు కోడలిపై ఎలాంటి కేసులు పెట్టవద్దని పోలీసులు, అధికారులను కోరింది. జరిగిన ఘటనపై వృద్ధురాలి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.


కొడుకుల పట్ల తల్లిదండ్రులు జాలి చూపించినా.. వృద్ధులను హింసించిన వారిపట్ల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.


Next Story

RELATED STORIES