Tirupati : భర్తపై కోపంతో 65 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణీ

Tirupati : నిండు గర్భిణి కూర్చుంటే లెగడమే కష్టం. అలాంటిది ఏకంగా 65 కిలోమీటర్లు నడిచింది. తిరుపతి నుంచి నాయుడుపేటకు నడుచుకుంటూ వెళ్లింది. నాయుడుపేట చేరే సరికి అర్ధరాత్రి ఒంటి గంట అవడం, అప్పటికే పురిటి నొప్పులు తీవ్రం కావడంతో ఆ గర్భిణి కేకలు పెట్టింది. అవస్థను గమనించిన చుట్టుపక్కల వాళ్లు 108 పిలిపించి, గర్భిణిని పంపించారు. ఆస్పత్రికి వెళ్లకముందే 108లోనే ఆడబిడ్డను ప్రసవించింది. ఇంతకీ ఈ గర్భిణీ 65 కిలోమీటర్ల పాటు నడవడానికి కారణం.. భర్తపై కోపం. రాజమండ్రికి చెందిన వర్షిని కూలీపనుల కోసం భర్తతో కలిసి తిరుపతి వచ్చింది. భర్తతో గొడవ జరగడంతో.. పంతం కొద్దీ తిరుపతి నుంచి నడక ప్రారంభించింది. రెండు రోజుల పాటు ఏమీ తినకుండానే నడిచింది. ప్రసవం తరువాత ఆకలేస్తోందని చెబితే.. 108 సిబ్బందే ఆహారం అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com