తూర్పుగోదావరి జిల్లాలో వాహనం బోల్తా.. దాంతో బయటపడ్డ రూ.7 కోట్ల నగదు

ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ విచ్చల విడిగా నగదు పంపిణీ జరుగుతోంది. కోట్ల రూపాయల నగదును ఎరగా వేసి ఓట్లు రాబట్టుకునేందుకు రాజకీయ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేసి నగదు కట్టలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు.
తూర్పుగోదావరి జిల్లాలో వాహనం బోల్తా పడి 7 పెట్టెల్లో భద్రపరిచిన రూ.7 కోట్ల నగదు బయటపడింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు ఏడు అట్ట పెట్టెల్లో అతికష్టంగా ప్యాక్ చేసిన 7 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీ ఢీకొని వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలో నగదు ఉన్న 7 కార్డ్‌బోర్డ్ పెట్టెలను తరలిస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వాహనం విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తోంది. బోల్తా పడిన వాహనం డ్రైవర్‌కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం గోపాలపురం ఆసుపత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com