Srikakulam: ఆ ఊరిలో లాక్‌డౌన్.. కానీ కరోనాకు భయపడి కాదు.. దయ్యాలకు భయపడి..

Srikakulam: ఆ ఊరిలో లాక్‌డౌన్.. కానీ కరోనాకు భయపడి కాదు.. దయ్యాలకు భయపడి..
X
Srikakulam: దయ్యాలున్నాయంటూ ఎవ్వరూ బయటకు రావడం లేదు.. ఏకంగా వారం రోజులు లాక్‌డౌన్‌ పెట్టారు.

Srikakulam: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ పెట్టడం చూశాం.. కానీ సిక్కోలు జిల్లాలోని ఓ పల్లెలో మాత్రం దుష్టశక్తులను పారద్రోలేందుకు లాక్‌ డౌన్ పెట్టారు. దయ్యాలున్నాయంటూ ఎవ్వరూ బయటకు రావడం లేదు.. ఏకంగా వారం రోజులు లాక్‌డౌన్‌ పెట్టారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో దయ్యం భయం అందర్నీ వణికిస్తోంది.

ఇటీవల ఆ గ్రామంలో అనారోగ్యంతో ముగ్గురు మృతి చెందారు. ఐతే.. దుష్టశక్తుల వల్లే వారు మృతి చెందారన్న భయంతో స్థానికులు గడపదాటడం లేదు. ఒడిశా మాంత్రికుల సలహాతో దుష్టశక్తులను ఊరినుంచి పారద్రోలేందుకు పూజలు చేస్తున్నారు. వెన్నెలవలస నుంచి స్థానికులు ఊరు దాటి బయటకు వెళ్లకుండా ముళ్ల కంచెలు పెట్టారు.

Tags

Next Story