Volunteer : చేతివాటం ప్రదర్శించిన వాలెంటీర్ .. వృద్దురాలితో తెల్లకాగితంపై సంతకాలు

Volunteer :  చేతివాటం ప్రదర్శించిన వాలెంటీర్ .. వృద్దురాలితో తెల్లకాగితంపై సంతకాలు
Volunteer : సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందించడం వాలెంటీర్ల విధి. కానీ తూర్పుగోదావరిజిల్లాలో ఓ వాలంటీర్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

Volunteer : సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందించడం వాలెంటీర్ల విధి. కానీ తూర్పుగోదావరిజిల్లాలో ఓ వాలంటీర్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్దురాలు వాసంశెట్టి మంగయమ్మ తన కుమారుడితో నివాసముంటుంది. ఈమెకు ప్రతినెలా జగన్ అన్న పెన్షన్ డబ్బులను కొట రవికుమార్ అనే వాలంటీర్ ఇస్తుంటాడు. పెన్షన్ డబ్బులు 2500 అయిందంటూ వాలంటీర్ రవికుమార్ .. ఆమె నుంచి వేలి ముద్రరూపంలో కొన్ని సంతకాలు తీసుకున్నాడు.

అధికారులు అడిగారంటూ ఐదు పేపర్లమీద మేలిముద్రలు వేయించుకొని వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వృద్దురాలు మంగయమ్మ ,... తనకుమారుడు విశ్వనాధానికి చెప్పింది. దీంతో అతను వాలంటీర్‌ రవికుమార్‌ను వివరణ అడుగగా .. అప్పుడు.. ఇప్పుడు చెపుతా అంటూ కాలయాపన చేశాడు. తీరా 45 రోజుల తర్వాత తన ఆస్తులను జప్తుచేస్తున్నామంటూ నోటీసులు రావడంతో ఖంగుతిన్నారు. పోలీస్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరుగలేదని వాపోతున్నారు.

తన భార్య కుటుంబ కలహాల కారణంగా కొద్దిరోజులుగా దూరంగా ఉంటుందని.. ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపిటీసీగా గెలిచిందని బాధితుడు విశ్వనాధం తెలిపాడు. అధికారంతో తమను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని.. వాలంటీర్‌ ద్వారా తాను లేనప్పుడు తన తల్లివేలిముద్రలు తీసుకొని తప్పుడు పత్రాలు సృష్టించి తమ ఆస్తులు కాజేయాలని చూస్తుందని ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో పోలీసులు కూడా పట్టించుకోక పోవడంతో జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశామంటున్నాడు.

వాలంటీర్ రవి కుమార్ వాదన మరోలా ఉంది. మంగయమ్మకు ప్రతినెలా పెన్షన్ డబ్బులు ఇస్తున్నానని.. ఆమె కులధృవీకరణ పత్రంకోసం దరఖాస్తుచేసుకోవడంతో ... ఆ ఫారమ్‌లో వేలిముద్రవేసి.. ఒక తెల్లకాగితం మీద వేలిముద్ర తీసుకున్నానని అంటున్నాడు. అవి తప్ప ఎటువంటి వేలిముద్రలు తీసుకోలేని అంటున్నాడు.

ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు అందించాల్సిన వాలంటీర్ .. అధికార పార్టీ నాయకులకు తొత్తుగా మారి తమను మోసం చేశాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమ తల్లినుంచి సంతకాలు తీసుకొని తప్పుడు పత్రాలు సృష్టించిన వాలంటీర్‌, అందుకు సహాకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని... తమకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story