తిరుపతి రైల్వేస్టేషన్‌లో మహిళకు తృటిలో తప్పిన ప్రాణపాయం..!

తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకుంది. రైలు నుంచి కిందకు దిగే క్రమంలో కదులుతున్న రైలు నుంచి కిందికి దూకింది. అయితే కాలు జారీ రైలు మధ్యలో పడిపోయింది. అదే సమయంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సతీష్ గమనించి.. ఆమెను చాకచాక్యంగా బయటికి లాగాడు. దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.
విశాఖ గాజువాకకు చెందిన భార్యాభర్తలు తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో నిన్న సాయంత్రం వైజాగ్ నుంచి బయల్దేరారు. ఈరోజు తెల్లవారుజామున తిరుమల చేరుకుంది రైలు. అయితే గాఢ నిద్రలో ఉన్న భార్యభర్తలు నిద్ర లేచే లోపే రైలు ప్లాట్‌ఫామ్ నుంచి కదిలింది. దీంతో హడావుడిగా మహిళ తిరుపతి ఎక్స్‌ప్రెస్ నుంచి దిగేందుకు ప్రయత్నించి కింద పడిపోయింది. చివరికి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సతీష్ ఆమెను పట్టుకుని ప్రాణాలను కాపాడాడు. ప్రమాదం నుంచి మహిళను రక్షించిన సతీష్‌ను రైల్వే అధికారులు అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com