Khammam: మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు.. మండపం ముందే ప్రియురాలి ఆందోళన..

Khammam: మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు.. మండపం ముందే ప్రియురాలి ఆందోళన..
Khammam: ఖమ్మం పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో పెళ్లి మండపం ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది.

Khammam: ఖమ్మం పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో పెళ్లి మండపం ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. ప్రియుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కోప్రోద్రిక్తులైన పెళ్లికొడుకు బంధువులు.. యువతిపై తీవ్రంగా దాడి చేశారు. జట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు గెంటేశారు. తనకు న్యాయం జరిగే వరకు వెళ్లేది లేదంటూ పెళ్లిమండపం ముందే యువతి బైఠాయించింది. విషయం తెసుకున్న పోలీసులు.. పెళ్లి మండపానికి చేరుకునేలోపే యువకుడి వివాహం జరిగిపోయింది. ప్రియుడి మోసంపై యువతి ఖమ్మం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఇపుడు మరో వివాహం చేసుకున్నాడని యువతి వాపోయింది.

Tags

Read MoreRead Less
Next Story