ఫుడ్ కోర్టులో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని యువకుడు మృతి..

ఫుడ్ కోర్టులో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని యువకుడు మృతి..
ఈ రోజుల్లో యువతీ యువకులకు ఇంటి భోజనం తినాలంటే ఎంత కష్టమైపోతుందో..

ఈ రోజుల్లో యువతీ యువకులకు ఇంటి భోజనం తినాలంటే ఎంత కష్టమైపోతుందో.. రెస్టారెంట్ కో, ఫుడ్ కోర్టుకో వెళ్లి నోరూరించే ఫుడ్ ని ఆర్డర్ ఇస్తుంటారు.. స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అవి ఎలా చేస్తున్నారో, శుభ్రత పాటిస్తున్నారా వంటి విషయాలేవీ కనుక్కునే ప్రయత్నం చేయరు.

తిరుపతికి చెందిన ఓ యువకుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని కొద్దిసేపటికే మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అయినా అప్పటికే పరిస్థితి విషమించి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఫుడ్ పాయిజన్ వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు దుకాణాన్ని తనిఖీ చేశారు.

పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు కళ్లముందు కనిపించాయి. వంటలకు ఉపయోగించే ప్రతి ఉత్పత్తిలో కల్తీ బహిర్గతమైంది. వంటనూనె దగ్గర్నుంచి, టీపొడి వరకు అన్నీ కల్తీనే. కస్టమర్ల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు దుకాణదారులు. ఈ కల్తీ వల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. ఫుడ్‌పాయిజన్‌తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఫుడ్ పాయిజన్ తో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Tags

Read MoreRead Less
Next Story