AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో ఏ6 అరెస్ట్

AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో ఏ6 అరెస్ట్
X

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ6గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు హైదారాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. కాసేపట్లో ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి రాజ్‌ కసిరెడ్డికాగా.. కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ గుర్తించింది.

Tags

Next Story